మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతినెల ఎన్నో రకాల పండుగలను జరుపుకుంటాము. ఈ క్రమంలోని ఈనెల 24వ తేదీ దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక కొన్ని ప్రాంతాలలో దీపావళి పండుగను ఐదు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.దీపావళికి ముందు రోజున నరక చతుర్దశి అంటారు. ఈ నరక చతుర్దశి రోజున నరకాసురుడి సంహరణ జరగడంతో ప్రజలందరూ కూడా సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం నరక చతుర్దశి రోజు మనం కొన్ని పనులు చేయటం వల్ల ఎంతో శుభ ఫలితాలను పొందవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం పటిక వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే. నరక చతుర్దశి రోజు పటికను ఈ విధంగా ఉపయోగించడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. నరక చతుర్థి రోజు ఉదయం నిద్ర లేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని స్నానం చేసే ముందు కాస్త పటికను మనం స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మనలో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. అలాగే ఎరుపు రంగు నూతన వస్త్రంలో కాస్త పటికను వేసి ఇంటి ప్రధాన గుమ్మానికి వేలాడదీయాలి.
ఈ విధంగా ఇంటి గుమ్మానికి పటికను కట్టడం వల్ల మన ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి ఇంట్లో సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా వెల్లువిరుస్తాయి. మన ఇంటిపై ఏ విధమైనటువంటి నెగిటివ్ ప్రభావం పడకుండా ఉంటుంది. ఇకపోతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఎరుపు రంగు వస్త్రంలో పటికను కట్టడం మంచిది. అలాగే మనం చేస్తున్న పనులు ప్రతిసారి వాయిదా పడటం, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగాదాలు ఏర్పడటం వంటివి జరిగితే నలుపు రంగు వస్త్రంలో పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది.