Icon Star : ఫన్నీ మూమెంట్ : రష్మికా దగ్గరున్నపుడు బన్నీ అలా ఫీల్ అవుతాడట.!

Icon Star : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న జరిగినటువంటి బుల్లితెర భారీ రియాలిటీ షో “ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్” అటెండ్ అయ్యి విజేతని తన చేతులు మీదుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో ఐకాన్ స్టార్ చాలా ఎంటర్టైన్మెంట్ తో పాటు కంటెస్టెంట్స్, వారి కొరియోగ్రాఫర్ లకి ప్రోత్సాహాన్ని అందించాడు. అయితే తాను తన సినిమా కోసం మరియు యూనిట్ సభ్యులు కోసం కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెప్పాడు.

ఓ సందర్భాల్లో అయితే బన్నీ జడ్జ్ గణేష్ మాస్టర్ తో మాట్లాడుతూ నవ్వుల బ్లాస్ట్ చేసాడు. గణేష్ మాస్టర్ తన దగ్గరకి వచ్చినపుడు. తన కోసం చెప్తూ నేను పొడవుగా ఉన్నానని ఫీల్ అయ్యేది ఇద్దరి దగ్గరే ఒకటి గణేష్ మాస్టర్ పక్కన ఉన్నపుడు అయితే ఇంకొకటి హీరోయిన్ రష్మికా మందన్నా దగ్గర ఉన్నప్పుడే అని చెప్పడంతో మంచి ఫన్నీ మూమెంట్ లా ఇది మారింది.

మరి ఈ ఇద్దరు కాంబినేషన్ లో ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇది ఈ డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.