“ఐ లవ్ యు” అంటున్న సుమ కనకాల !

Suma And Rajeev Kanakala

తెలుగు బుల్లితెర మీద తిరుగులేని స్టర్డామ్ సంపాదించుకుంది యాంకర్ సుమ కనకాల. తాను గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు మొదటగా ఒక సినిమాలో హీరోయిన్ గా వక్కంత వంశీ హీరో గా చేసింది. అయితే తర్వాత సీరియల్ నటిగా గుర్తింపు బాగానే వచ్చినా ఫైనల్ గా యాంకర్ గా మంచి పొజిషన్లో స్థిరపడింది.

Suma And Rajeev Kanakala
Suma And Rajeev Kanakala

రాజీవ్ కనకాల కళాకారుల కుటుంభం నుండి వచ్చి ముందు సీరియల్ నటుడిగా తర్వాత సినిమా నటుడిగా మంచి పేరే సంపాదించారు. అయితే ఎందుకో రాజీవ్ కనకాలకి రావాల్సినంత పేరు రాలేదు.

సుమ రాజీవ్ కలిసి జీవన రాగాలు లాంటి సూపర్ హిట్ సీరియల్ లో నటించి తర్వాత ప్రేమలో పడి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి ప్రేమకథ గురుంచి కథలు కథలుగా చెప్పుకునేవారు.

పెళ్ళై దాదాపు ఇరవై సంవత్సారాలు కావొస్తున్నా ఇంకా కొత్త జంటలాగ ఒకరి మీద ఒకరు అవకాశం దొరికినప్పుడల్లా వారి ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. సోషల్ మీడియా పాపులర్ అయినా తర్వాత ఇప్పుడు తమ ప్రేమను బహిరంగంగా తెలియజేసుకుంటున్నారు ఇద్దరు.

ఈ రోజు రాజీవ్ కనకాల పుట్టిన రోజు. ఈ సందర్భంగా సుమ ఇంస్టాగ్రామ్ ద్వారా తన భర్తకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి రోజు కొత్తగా నీతో గడపడానికే నేను ఎదురుచూస్తుంటాను…నువ్వే నా బలం , నువ్వే నా సంతోషం , నువ్వే నాకో వరం అనే తన ప్రేమను రాజీవ్ మీద వ్యక్తపరిచింది సుమ.

తెలుగురాజ్యం తరఫున రాజీవ్ కనకాలకి పుట్టిన రోజు శుభాకాంక్షలు!!