Meka Ramakrishana: సైరా షూటింగ్‌లో గుర్రం మీద నుంచి కింద పడటంతో ఎన్నో గాయాలయ్యాయి.. మేక రామకృష్ణ!

Meka Ramakrishana: బాహుబలి అనే ఒక పాన్ ఇండియా మూవీ తర్వాత అంత రేంజ్‌లో, అంత ఖర్చు పెట్టిన చేసిన సినిమా సైరా నరసింహా రెడ్డి అని నటుడు మేక రామకృష్ణ అన్నారు. రామ్ చరణ్ గానీ, సురేందర్ రెడ్డి గారు గానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ సినిమాను తెరకెక్కించారని ఆయన చెప్పారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలో చాలా బాగా నటించారని, దాని కోసం ఆయన చాలా కష్టపడ్డారని రామకృష్ణ తెలిపారు. తాను 1997లో ఉయ్యాలవాడ సీరియల్ చేసినపుడు నంది అవార్డు అవార్డు వచ్చిందని, మళ్లీ అదే 25 సంవత్సరాల తర్వాత చిరంజీవి ఒక సినిమా చేశారని అదే సైరా అని ఆయన వివరించారు.

ఇదిలా ఉండగా ఆ సినిమాలో తాను నటించినప్పటి కొన్ని జ్ఞాపకాలను ఆయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా పంచుకున్నారు. అదేంటంటే ఒక రోజు డైరెక్టర్ గారు గానీ, చిరంజీవి గారు గానీ ఆ రోజు లేరని, ఒక నాలుగైదు షాట్స్ షూట్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఆ సందర్భంలో గుర్రం కాళ్లు తీసి పక్కకు పెట్టే సమయంలో ఆ షాట్స్ తీశారని ఆయన అన్నారు. తాను ఆ గుర్రం మీది నుంచి దిగుదామనుకున్న సమయంలోనే, వెనక ఉన్న వాళ్లు చూసుకోకుండా ఆ గుర్రాన్ని కొట్టారని ఆయన చెప్పారు. అప్పటికీ తాను గుర్రంపై స్వారీ చేస్తున్నానని, అది కంట్రోల్ చేసుకునేటప్పటికీ ఒక పెద్ద చెట్టు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అంతలోనే ఒక వ్యక్తి వచ్చి ఆపేసరికి, ఆ చెట్టు పక్కకు వెళ్లిపోయానని ఆయన చెప్పారు. తన అదృష్టం బాగుండి తనకు ముఖంపై ఎలాంటి గాయాలూ కాలేదని, కానీ తన భుజంపై మాత్రం కొంచెం గాయం అయ్యిందని ఆయన తెలిపారు. కానీ దానికంటే ఎక్కువగా తన మనసులో ఏమైతుందో ఏంటో తెలియక ఒక రకమైన భయం వచ్చేసిందని ఆయన చెప్పారు. వెంటనే అక్కడున్న వారు స్పందించి తనకు వైద్యం చేయించారని ఆయన వివరించారు.