అల్లు అర్జున్ ‘పుష్ప’ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు. డైరెక్టర్ సుకుమార్ కూడ అలానే ఉన్నారు. సినిమాను ఏ విషయంలోనూ తక్కువ కాకుండా చూసుకుంటున్నారు. చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేషనల్ లెవల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను భారీ వ్యయంతో కళ్ళు చేదిరేలా తెరకెక్కిస్తున్నారట. సినిమాను పార్ట్ 1 పార్ట్ 2గా విడగొట్టారు. అందుకే కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. వాటిలో భాగంగానే మొదటి భాగం సినిమాను ముందుగా అనుకున్నదానికంటే ఇంకా గొప్పగా ఉండేలా చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్లో నదిలో తేలే తెప్పల షాట్స్ గుర్తుండే ఉంటాయి. మామూలుగా అయితే దాన్ని అంత భారీగా డిజైన్ చేయలేదట. కానీ ఇప్పుడు మాత్రం దాన్నొక పెద్ద ఫైట్ గా మార్పు చేశారట. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాల్లో బోట్ ఫైట్స్ పెద్దగా వచ్చింది లేదు. అందుకే దీన్ని అందరూ చెప్పుకునేలా హెవీగా డిజైన్ చేశారట. సినిమాలోని అన్ని పోరాట సన్నివేశాల్లోకీ ఇదే అత్యంత ఖరీదైనదట. త్వరలో మొదలుకాబోయే షెడ్యూల్లో దీన్ని చిత్రీకరిస్తారు టీమ్. మొదటి పార్ట్ గొప్పగా ఉన్నప్పుడే రెండవ భాగం మీద ప్రేక్షకుల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్, అంచనాలు క్రియేట్ అవుతాయి. అందుకే మొదటి భాగం భారీ లెవల్లో ఉండేలా చూసుకుంటున్నారు.