ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి కొన్ని విషయాలు మాట్లాడారు. రాజ్ భవన్ స్కూల్ లో భోజన సౌకర్యాలు కల్పించామని, రాష్ట్రానికి సేవలు చేస్తూ సవాళ్లను ఎదుర్కొంటున్నామని అన్నారు.
అయినా కూడా బాధ పడను అంటూ.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నాను అని.. ఈ రాష్ట్రానికి తాను గవర్నర్ గా కాకుండా అందరికీ సహోదరిని అని అన్నారు. ఎవరు ఎంత ఆపినా అందర్ని కలుస్తాను అని అన్నారు.