కమల్ హాసన్ ఆరోగ్యం ఎలా ఉంది?వారికి శృతి హాసన్ థాంక్స్.!

తన నటనతో యావత్తు ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసిన నటుడు లోక నాయకుడు కమల్ హాసన్. మరి కమల్ ఇప్పుడు తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తో “విక్రమ్” అనే సాలిడ్ ఏక్షన్ ఎంటర్టైనర్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి చేసే పనిలోనే అమెరికాకి వెళ్లారు.

అయితే అక్కడికి వెళ్లి రావడంతోనే కరోనా పాజిటివ్ వచ్చింది అనే వార్త అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇపుడు కమల్ ఆరోగ్యానికి సంబంధించి చెన్నై ఆసుపత్రి శ్రీ రామ చంద్ర మెడికల్ సెంటర్ వారు తాజా బులిటెన్ ని రిలీజ్ చేసారు. దీని ప్రకారం అయితే కమల్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

ఇక అలాగే కమల్ కుమార్తె స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన తండ్రి ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుకున్న వారికి ప్రార్ధించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాని చెప్పి తన తండ్రి కోలుకుంటున్నారని త్వరలోనే మళ్ళీ అందరితో ఇంటరాక్ట్ అవుతారని చెప్పింది.