Ram Prasaad: మురారి సినిమా తీస్తున్నపుడు తాము చాలా కష్టపడ్డామని ప్రముఖ కెమెరామెన్ రామ్ ప్రసాద్ అన్నారు. ఆ సినిమాలో ఓ పెళ్లి సాంగ్ షూట్ చేసేటపుడు చాలా ఫేస్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో 3 కలర్స్ మాత్రమే అడ్జస్ట్ చేయగలమని, ఇప్పుడు మాత్రం ఒక్కో కలర్‌లోనూ దాదాపు 150 కలర్స్‌ని టచ్ చేయొచ్చని ఆయన అన్నారు.
ఇకపోతే కెమెరామెన్‌కి తాము ఏం తీస్తున్నామో తెలియదని ఆయన చెప్పారు. అప్పట్లో మానిటర్ కూడా లేదని, అవి వచ్చాకే కెమెరామెన్ ఏం తీస్తున్నాడో మానిటర్‌లో చూడడానికి వీలవుతుందని ఆయన అన్నారు. ఇంతకుముందు కెమెరామెన్ ఏం చెప్తే అదే అని, ఆ తర్వాతే తాము చూసుకునేవారమని ఆయన చెప్పారు. అలా జడ్జ్ చేసుకుంటూ తీయాలని, అలా ఫర్పెక్ట్‌గా జడ్జ్ చేసుకుంటూ తీసిన సినిమా మురారి అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కొన్ని రిస్క్ షాట్స్ కూడా ఈ సినిమాకు తీశామని రామ్ ప్రసాద్ అన్నారు. ఆ సినిమాలో ఓ డేంజర్ ఎలిమెంట్ ఉంటుందన్న ఆయన, హీరోకు ఎప్పుడూ ఏదో అవుతూ ఉంటుందని ఆయన అన్నారు. అలాంటి సీన్లలో భాగంగా కొబ్బరి కాయలు చెట్టు నుంచి హీరో మీద పడబోయే సీన్‌ను తాము షూట్ చేశామని ఆయన తెలిపారు. అప్పుడు తనను ఓ 40 ఫీట్ల క్రేన్ మీద కూర్చోబెట్టి, చెట్టు మీద కూర్చున్నాక క్రేన్ తీసేసారని, అప్పుడు ఒక చేత్తో కెమెరా పట్టుకొని, మరొక చేతిలో కొబ్బరి గెల చేతిలో పట్టుకోవాలి. ఆయన ఓకే చెప్పినపుడు ఆ గెల కిందకు పడేసి, కెమెరాను కంట్రోల్ చేయాలి అని ఆయన చెప్పారు. అలా ఆ సినిమాకు కష్టపడ్డామని ఆయన తెలిపారు. అవే ఇప్పుడు చేయాలంటే కష్టం అని, అయినా ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చిందని ఆయన వివరించారు.