వెంకటేష్ సినిమా సోల్డ్ అవుట్

Hot star bags Drushyam-2 streaming rights
Hot star bags Drushyam-2 streaming rights
 
విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రాల్లో ‘దృశ్యం-2’ కూడ ఒకటి.  జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  మలయాళ హిట్ చిత్రం ‘దృశ్యం-2’కి ఇది రీమేక్. అతి తక్కువ టైంలో షూటింగ్ ముగించారు.  సినిమా చేయాలి అనుకున్నప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు టీమ్.  ఆ ప్రకారమే ఓటీటీ సంస్థలకు ఆహ్వానం పలికారు. మంచి ఫ్యాన్సీ రేటు పలకడంతో సినిమాను విక్రయించేశారు నిర్మాత సురేష్ బాబు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ సినిమా యొక్క శాటిలైట్, డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.  
 
మలయాళం వెర్షన్ మంచి విజయం దక్కించుకోవడంతో తెలుగు వెర్షన్ మీద అంచనాలు గట్టిగా ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. పూర్తి హక్కులు ఓటీటీ సొంతం చేసుకోవడంతో థియేట్రికల్ రిలీజ్ ఉండదు. ఇందులో వెంకటేష్ సరసన మీనా కథానాయికగా నటిస్తోంది.  ఇక :నారప్ప’ను కూడ ఓటీటీ ద్వారా విడుదల చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో అభిమానులు ఎంత ఆలస్యమైనా ‘నారప్ప’ను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాత సురేష్ బాబును డిమాండ్ చేస్తున్నారు.