అశ్విన్ ,అనీల్ క‌న్నెగంటి, ఎస్‌,వి.కె సినిమాస్ ‘హిడింబ‌’ షూటింగ్ పూర్తి.

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అశ్విన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ‌’. అనీల్ క‌న్నెగంటి ద‌ర్శక‌త్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్‌ బ్యాన‌ర్‌ పై శ్రీధ‌ర్ గంగ‌ప‌ట్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ , టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. ఒక షాకింగ్ పాయింట్ తో, బ్రాండ్ న్యూ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అశ్విన్ సరికొత్తగా మేకోవ‌ర్ అయ్యారు.

మకరంద్ దేశ్ పాండే, సిజ్జు, రాజీవ్ క‌న‌కాల‌, శ్రీనివాస రెడ్డి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ర‌ఘు కుంచె , ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహిస్తున్నారు. వికాస్ బ‌డిసా సంగీతాన్ని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

అశ్విన్ , నందితా శ్వేత‌, సిజ్జు, మకరంద్ దేశ్ పాండే, రాజీవ్ పిళ్లై, సంజ‌య్ స్వరూప్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, శ్రీనివాస రెడ్డి, ర‌ఘు కుంచె, రాజీవ్ క‌న‌కాల‌, ఛత్రపతి శేఖర్, అజయ్ రత్నం, దీప్తి నల్లమోతు, సమీర్ త‌దిత‌రులు

సాంకేతిక విభాగం:

ద‌ర్శక‌త్వం: అనీల్ కన్నెగంటి

నిర్మాత‌: శ్రీధ‌ర్‌ గంగ‌ప‌ట్నం

బ్యాన‌ర్‌: ఎస్‌.వి.కె సినిమాస్‌

సినిమాటోగ్రఫీ: బి.రాజ‌శేఖ‌ర్‌

ఎడిట‌ర్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ

ఫైట్స్‌: రియ‌ల్ స‌తీశ్‌, జాషువా, అనీల్ కన్నెగంటి

సంగీతం: వికాస్ బడిసా

కొరియోగ్రఫర్స్‌: య‌శ్‌ , రాజు

డైలాగ్స్‌: క‌ళ్యాణ్ చ‌క్రవ‌ర్తి

లిరిక్స్: రామ‌జోగయ్య శాస్త్రి, ప్రణ‌వం , విరించి పుట్ల

కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: మౌన గుమ్మడి

ఆర్ట్‌: ష‌ర్మిల య‌లి శెట్టి

పీఆర్వో : వంశీ శేఖ‌ర్‌

పబ్లిసిటీ : అనిల్ భాను