అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ కామెంట్స్ చేసిన నెటిజన్… దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన మాధవీ లత!

రవిబాబు దర్శకత్వంలో తనీష్ హీరోగా తెరకెక్కిన నచ్చావులే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మాధవీ లత.ఈమె ఈ సినిమా అనంతరం పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.ఈ క్రమంలోనే సినిమాకు దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో జరిగే విషయాల గురించి తరచూ స్పందిస్తూ ఉంటారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైన మాధవీలత రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.అదేవిధంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తూ తనదైన శైలిలో తన అభిప్రాయాలను తెలియ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ చేస్తూ.. అమ్మవారి బంగారు వాకిలి దర్శనం చాలా బాగా జరిగింది అంటూ ఈ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఒక నెటిజన్ ఈ పోస్ట్ పై స్పందిస్తూ అక్కా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, నువ్వంటే చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో అక్క అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ పై స్పందించిన మాధవీలత తనదైన శైలిలో సదరు నెటిజన్ కి రిప్లై ఇచ్చారు.

ఈ విధంగా నెటిజన్ కామెంట్ చూసిన మాధవీ లతకు ఒక్కసారిగా ఒళ్ళు మండి పోవడంతో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అక్కని పెళ్లి చేసుకుంటావా హౌలే, గూట్లే అని అనాలని ఉంది కాని అనను అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా నెటిజన్ చేసిన కామెంట్ కు మాధవీ లత అదిరిపోయే సమాధానం చెప్పింది. ఇలా సినిమాలకు దూరమైన మాధవీలత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాల పై, సినిమా ఇండస్ట్రీ గురించి ప్రస్తావిస్తూ తనదైన శైలిలో పోస్టులు పెడుతూ ఉంటారు.