Ram Charan : చరణ్ మరో భారీ సినిమాకి హీరోయిన్ ఈమేనట..ఫ్యాన్స్ కి మాత్రం నచ్చలేదు!

Ram Charan : ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన కెరీర్ లో పీక్ కి వెళ్తున్నాడని చెప్పాలి. తనదైన సినిమాలు ఎంచుకుంటూ పాన్ ఇండియా మార్కెట్ దగ్గర తనకి కూడా సెపరేట్ మార్కెట్ పెంచుకునే దిశగా ఒక్కో సినిమాని ఎంచుకుంటూ వెళ్తున్నాడు.

మరి ప్రస్తుతం అయితే దర్శక ధీరుడు రాజమౌళి తీసిన మోస్ట్ అవైటెడ్ భారీ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తో పాన్ ఇండియా సినిమా మీదకి దూసుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దీని తర్వాత అయితే దర్శకుడు శంకర్ తో ఇంకో భారీ సినిమా అనౌన్స్ చేసి సంచలనం రేపాడు.

దీని తర్వాత టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననురితో సినిమా అనౌన్స్ చేసి ఇంకా ఆసక్తి రేపగా ఇప్పుడు దీనిపైనే ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి ఆల్రెడీ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అది మరెవరో కాదు స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా అని తెలుస్తుంది.

అయితే జస్ట్ ఈ టాక్ వినిపించడంతోనే చరణ్ ఫ్యాన్స్ కి అయితే ఇది నచ్చలేదని చెప్పేస్తున్నారు. గతంలో పుష్ప కి అల్లు అర్జున్ సరసన రష్మికా పేరు వచ్చినపుడు కూడా ఇదే తరహా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు చరణ్ సినిమాకి కూడా ఫ్యాన్స్ నుంచి అలానే వినిపిస్తుంది. కానీ ఇది అయితే ఫిక్స్ అవ్వకముందే వినిపిస్తుంది. మరి వేచి చూడాలి చరణ్ సరసన ఎవరు ఫైనల్ అవుతారో..