యాంకర్ ఉదయభాను పై సెటైర్లు వేసిన యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?

తెలుగు బుల్లితెర పై యాంకర్ గా ఒక వెలుగు వెలిగింది యాంకర్ ఉదయభాను. అప్పట్లో ఈమె తన మాటలతో, చలాకీతనంతో, యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఎన్నో షోలకు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల టీవీ షోలకు కార్యక్రమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ఆ తరువాత సినిమాలకు దూరం అయిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై తన సత్తాను నిరూపించుకుంది. అలా అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో టాప్ మోస్ట్ యాంకర్ గా కొనసాగింది.

ఏ షోలో చూసినా కూడా ఆమె కనిపించేది. ఇకపోతే ఉదయభాను కు ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరూ కూడా కవల పిల్లలు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో సందడి సందడి చేసింది ఉదయభాను. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమా ఈవెంట్ కి ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఈ ఈవెంట్ లో ఒక యంగ్ హీరో ఆమెపై సెటైర్లు వేయడంప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ చోర్ బజార్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్ యాంకర్ ఉదయభాను ని ఒక ఆట ఆడుకున్నాడు.

అంతేకాకుండా స్టేజిపై ఆమెపై వరుసగా పంచులు వేస్తూ స్టేజి పైనే ఉదయభాను మొఖం మాడిపోయే విధంగా చేశాడు. హీరో విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే.ఛాన్స్ దొరికింది అంటే చాలు తారు సెటైరికల్ పంచులతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అలా తాజాగా చోర్ బజార్ ఈవెంట్లో ఉదయభానుపై పంచులు వేసి అందర్నీ నవ్వించాడు. ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్ ని ఉదయభాను వేదిక మీదికి పిలిచింది. విశ్వక్ సేన్ స్టేజి మీద కు ఎంట్రీ ఇవ్వగానే సినిమాల్లో కంటే రియల్ గానే చూడడానికి చాలా బాగున్నావు అని కాంప్లిమెంట్ ఇవ్వడంతో వెంటనే విశ్వక్ సేన్ మిమ్మల్ని చూసే పెరిగాను అంటూ సెటైర్ వేశాడు.

ఆ మాటకు ఉదయభాను ఏం మాట్లాడాలో తెలియక నవ్వేసింది. విశ్వక్ సేన్ అంతటితో ఆగకుండా చిన్నప్పటినుంచి ఉదయభానుని చూడాలి అనుకున్నానని ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత తన కోరిక తీరింది అని అనగా వెంటనే ఉదయభాను కౌంటర్ వెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను కూడా మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూడాలనుకున్నాను మొత్తానికి ఇప్పుడు కలుసుకున్న అని ఉదయభాను తెలిపింది. అప్పుడు విశ్వక్ సేన్ మీరు చిన్నగా ఉన్నప్పుడు నేను పుట్టలేదు అని అనడంతో ఉదయభానుకి మళ్లీ సెటర్ వేసినట్లయింది. అప్పుడు ఉదయభాను ఆ కౌంటర్ ను కవర్ చేసేందుకు మీకు నాకు నాలుగైదేళ్లు తేడా ఉంటుంది లేండి అని అన్నా కూడా ఆ డైలాగ్ పెద్దగా వర్కవుట్ కాలేదు. అలా ఈ యంగ్ హీరో ఉదయభానుని ఉద్దేశించి సెటైర్లు వేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.