Samantha : సమంత దూకుడుని ఆపేవాళ్లే లేరు. ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ కూడా దూకుడు చూపిస్తోంది సమంత. డిఫరెంట్ ప్రాజెక్టులు టేకప్ చేస్తూ, ప్రెస్టీజియస్‌గా కెరీర్‌లో జెట్ స్పీడులో దూసుకెళ్లిపోతోంది. సమంతకు సంబంధించిన ఏ న్యూస్ అయినా హాట్ న్యూసే అనేంతలా ఆమె ఇమేజ్ డెవలప్ చేసుకుందనడం ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.
సరే, అంతా బాగానే వుంది. అంచెలంచెలుగా పెరిగిపోతున్న సమంత ఇమేజ్ చూసి ఓ హీరో తెగ కుళ్లుకుంటున్నాడట. ఎవరా హీరో.? అనుకుంటున్నారా.? మరెవరో కాదు, సిద్ధార్ధ్. ఒకప్పుడు వీరిద్దరి మధ్యా ఏదో వుందంటూ తెగ ప్రచారం జరిగింది. ఇంకేముంది వీళ్లిద్దరూ పెళ్లి చేసేసుకుంటున్నారట.. అనే వార్తలు కూడా గుప్పుమన్నాయ్.
కానీ, అదంతా తుస్ మనింది. మధ్యలో నాగ చైతన్య వచ్చాడు. సమంతను ఎగరేసుకెళ్లిపోయాడు. చైతూతో పెళ్లి – విడాకులు.. అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ సమంత స్టేటస్ ‘సింగిల్’. అయితేనేం, కెరీర్‌లో సమంతను కొట్టేవాళ్లే లేరు. ఓ పక్క సోషల్ మీడియాలోనూ, మరో పక్క వరుసగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతోనూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
అటు సిద్దార్ధ విషయానికొస్తే, సోషల్ మీడియాలో వాళ్ల మీదా, వీళ్ల మీదా సెటైర్లు వేస్తూ, నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. కెరీర్‌లో చాలా డల్‌గా వున్నాడు. అందుకేనేమో, సమంత ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నాడు కాబోలు. చేసేదేం లేక పరోక్షంగా సమంతపైనా సెటైర్లు వేస్తూ నెట్టింట్లో కాలక్షేపం చేస్తున్నాడు.