నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. సూపర్ మార్కెట్ లో భారీ నష్టం..!

కొన్ని సందర్భాలలో అనుకోకుండా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అగ్ని ప్రమాదాల వల్ల భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఆదివారం తెల్లవారుజామున సంభవించింది. పట్టణంలోని ఆర్యనగర్‌లో ఉన్న టి మార్ట్ సూపర్ మార్కెట్‌లో చిన్నగా చెలరేగిన మంటలు సూపర్ మార్కెట్ మొత్తం వ్యాపించి భారీ స్ధాయిలో ఆస్తి నష్టం జరిగింది.

వివరాలలోకి వెళితే… నిజామాబాద్ పట్టణంలోని
ఆర్యనగర్ లో ఉన్న టి మార్ట్ సూపర్ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట చిన్నగా మొదలైన మంటలు సూపర్ మార్కెట్ మొత్తం వ్యాపించి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఆదివారం తెల్లవారుజామున సూపర్ మార్కెట్ చుట్టుపక్క ప్రాంతాలలో భారీగా పొగ అలుముకోవటంతో అది గమనించిన స్థానికులు వెంటనే అప్రపత్తమై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయటానికి దాదాపు 3 గంటలు శ్రమించి తీవ్ర ప్రయత్నం చేశారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాదం జరగటానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రూ 2 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అగ్ని ప్రమాదం జరగటానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.