నువ్వు నాకు నచ్చావ్ సినిమా రిజెక్ట్ చేసి బాధ పడ్డ హీరో

వెంకటేష్ కెరీర్ లో చాలా సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటివరకు మాస్, ఫామిలీ సినిమాలు ఎక్కువగా చేసిన వెంకటేష్ మొదటిసారి తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఇంప్రెస్స్ చేసాడు.

ఈ సినిమా విడుదలై 21 సంవత్సరాలైనా ఇప్పటికీ టీవీలలో ఈ సినిమా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఆ టైం లో డైరెక్టర్ విజయ్ భాస్కర్, నిర్మాత స్రవంతి రవికిశోర్ ది సక్సెస్ఫుల్ కాంబినేషన్. విజయ్ భాస్కర్ దర్శకత్వం కంటే త్రివిక్రమ్ డైలాగ్స్ వలన అప్పట్లో సినిమాలో హిట్ అయ్యాయి.

ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారడంతో విజయ్ భాస్కర్ కనుమరుగైపోయాడు. ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా పరిచయమైన ఈ సినిమా కి మొదట హీరో గా తరుణ్ ని అనుకున్నారు. అయితే అప్పటికే ‘నువ్వే కావాలి’ సూపర్ హిట్ తో వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. తరుణ్ రిజెక్ట్ చెయ్యడంతో ఆ ప్లేస్ లో వెంకటేష్ ను తీసుకున్నారు.

‘దేవి పుత్రుడు’, ‘ప్రేమతో రా’.. వంటి వరుస ప్లాప్ సినిమాలతో ఉన్న వెంకీ “నువ్వు నాకు నచ్చావ్” సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చారు.అప్పట్లో ఈ సినిమా కొన్ని థియేటర్లలో సంవత్సరం పాటు ఆడి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ని వదులుకున్నందుకు తరుణ్ చాలా బాధపడ్డారట. ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.