రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?

రాజమౌళి సినిమా లో ఆఫర్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ‘బాహుబలి’, ‘RRR ‘ లాంటి సినిమాలతో ప్రపంచం మొత్తం ఫేమస్ అయిన రాజమౌలి త్వరలో మహేష్ బాబు తో ఒక అడ్వెంచర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీ ఉన్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఆఖర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

ఇప్పటివరకు మహేష్ బాబు తప్ప ఇతర ఆర్టిస్ట్స్ ని ఇంకా సెలెక్ట్ చెయ్యలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

దీపికా ఇప్పటికే ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలో నటిస్తుంది. మహేష్  సినిమా  కోసం దీపికా ని హీరోయిన్ గా నటింపచేయాలని ఫిలిం మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక, కొంత గ్యాప్ తీసుకుని రాజమౌళి సినిమా జాయిన్ అవుతాడు మహేష్ బాబు.