నాగ శౌర్య, #NS24 చిత్రానికి సంగీతం అందించనున్న హారిస్ జయరాజ్, డీవోపీగా వెట్రి పళనిసామి

NS24:  ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. తన 24 వ చిత్రాన్ని ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో చేయనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ప్రకటించారు మేకర్స్. అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన స్టార్ కంపోజర్ హారిస్ జయరాజ్ NS24 కి సంగీతం అందించనున్నారు. తెలుగులో చాలా కాలం తర్వాత హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. అలాగే ఈ చిత్రానికి వీరం, వేదాళం, విశ్వాసం కాంచన 3 లాంటి సూపర్ హిట్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి డీవోపీగా పని చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

దర్శకుడు ఎస్‌ ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: నాగశౌర్య

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎస్ఎస్ అరుణాచలం
నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి
బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్
సమర్పణ: బేబీ అద్వైత, భవిష్య
సంగీతం: హారిస్ జయరాజ్
డీవోపీ : వెట్రి పళనిసామి
పీఆర్వో: వంశీ-శేఖర్