పవన్ ఫ్యాన్స్ కి హరీష్ శంకర్ వార్నింగ్..ఇకనైనా మారతారా??

మన తెలుగు సినిమా దగ్గర భారీ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అగ్ర హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. అయితే పవన్ ఉన్న క్రేజ్ కోసం పక్కన పెడితే తన అభిమానుల అత్యుత్సాహం మాత్రం ఒకింత ఎక్కువే ఉంటుంది అని చెప్పాలి. అది రాజకీయాల్లో ఎంత వరకు పనికి వస్తుందో కానీ సినిమాల్లో బాగానే వసూళ్ళలో వస్తుంది. 

అయితే ఈ క్రేజ్ పట్ల ఇతర హీరోల సినిమాల వేడుకల్లో కూడా చాలా సార్లు ఆ సినిమాల హీరోలు యూనిట్ వారు ఇబ్బందులు పడ్డారు. పవన్ కి క్రేజ్ ఉంది కానీ వేరే సినిమాల వేడుకల్లో కూడా అభిమానుల కోలాహలం శృతి మించడం అనేది కరెక్ట్ కాదు. అలా తాజాగా పవన్ హాజరు అయ్యిన వేడుక “అంటే సుందరానికి”. 

నాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా వేడుక నిన్న ఘనంగా జరగ్గా పవన్, నాని అభిమానులతో శిల్పకళావేదిక కిక్కిరిసిపోయింది. మరి ఈ సందర్భంగా అయితే దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా వేరే వాళ్ళ ఫంక్షన్స్ లో గోల పెట్టడం కరెక్ట్ కాదని.. 

అంతా క్రమశిక్షణతో ఉంటే పవన్ కూడా మరిన్ని ఫంక్షన్స్ కి వస్తారు అని అప్పుడు మనం ఎక్కువసార్లు ఆయన్ని బయట చూసే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ ఇష్టం అని ఛాయిస్ వాళ్ళకే ఇచ్చేసాడు. దీనితో అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అప్పుడు నుంచి మళ్ళీ వేడుక ప్రశాంతంగా జరిగింది. మొత్తానికి అయితే హరీష్ శంకర్ వార్నింగ్ మాత్రం బాగానే పని చేసింది కానీ తర్వాత అయినా ఇదే మార్పులో ఉంటారో లేదో చూడాలి.