డైనమిక్ స్టార్ విష్ణు మంచుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారుపేరు అని సినీ పరిశ్రమలో అందరూ చెబుతారు. ఆయన వారసుడిగా పరిశ్రమలో ప్రవేశించిన విష్ణు మంచు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. నటనలో, నాయకత్వ లక్షణాల్లో తండ్రికి తగ్గ వారసుడు అని అభినందనలు అందుకుంటున్నారు. ఈ రోజు విష్ణు మంచు బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

అభిమానులు, ప్రేక్షకులు విష్ణు మంచుకు ‘డైనమిక్ స్టార్’ అని బిరుదు ఇచ్చారు. అది నిజమే అనిపిస్తుంది. విష్ణు యాక్టింగ్, ఫైట్లలో డైనమిజం కనబడుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసే యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. విష్ణు లాస్ట్ ఫిల్మ్ ‘జిన్నా’ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళంలో రిలీజ్ అయ్యింది. డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. అందులో విష్ణు, సన్నీ లియోన్ డ్యాన్స్ చేసిన ‘జారు మిఠాయి’ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. కొంత మంది ఆ పాటను తమ సినిమా ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకున్నారు. ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రౌడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ హిట్స్ తర్వాత ఇప్పుడు ‘ఢీ & ఢీ’ చేయడానికి విష్ణు రెడీ అవుతున్నారు.

రియల్ లైఫ్‌లో కూడా విష్ణు మంచు డైనమిక్‌గా ఉంటారు. తప్పును తప్పు అని, ఒప్పును ఒప్పు అని చెబుతారు. ‘మా’ అధ్యక్షుడిగా కళాకారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు. నాయకుడిగా మన్ననలు అందుకుంటున్నారు. హ్యాపీ బర్త్ డే విష్ణు మంచు.