Hanuman Flag: హనుమాన్ జెండాను ఇంటిపై ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు?

Hanuman Flag: సాధారణంగా హిందువులు ఇతర స్వామి వారితో పాటు ఆంజనేయ స్వామిని కూడా ఎంతగానో పూజిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది వారి ఇంటి పై ఆంజనేయస్వామి జెండాలను పెట్టుకోవడం అలాగే, ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి ఫోటోలను తగిలించడం మనం చూస్తూ ఉంటాము. ఇలా ఆంజనేయ స్వామి ఫోటోలను పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే….

ఆంజనేయస్వామి ఎంతో బలవంతుడు అనే విషయం మనకు తెలిసిందే. ఎలాంటి భూతప్రేత పిశాచులనైనా తన పాదాల కింద తొక్కేస్తారు. అలాగే ఆంజనేయస్వామి విజయానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే సమయంలో శ్రీకృష్ణుడు తన రథానికి ఆంజనేయస్వామి జెండా కట్టి రథసారథిగా మారుతాడు. ఇలా జెండాతో యుద్ధంలోకి దిగడంతో పాండవులు విజయాన్ని పొందుతారు.

అందుకోసమే ఆంజనేయస్వామి జెండాను మన ఇంటి పై భాగంలో పెట్టడం వల్ల మన ఇంటి పై ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా ఉండటమే కాకుండా, మన ఇంటి పై ఎలాంటి భూతప్రేత పిశాచల ప్రభావం కూడా ఉండదని విశ్వసిస్తారు. అందుకోసమే ప్రతి ఒక్కరు వారి ఇంటి పై భాగంలో ఆంజనేయస్వామి జెండా కడతారు.అదే విధంగా ఎలాంటి దుష్ట శక్తులు మన ఇంటిలోకి ప్రవేశించకుండా ఉండడం కోసం మరి కొందరు ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆంజనేయ స్వామి ఫోటోను కడతారు.