ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ టీజర్ నవంబర్ 21న విడుదల.

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్, యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజల ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్‌’ టీజర్ ని ఈ నెల 15న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే గత 15వ తేదీన సూపర్‌స్టార్ కృష్ణ గారు కన్నుమూయడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు. ఈ రోజు, మేకర్స్ టీజర్ రిలీజ్ కోసం కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హను-మాన్ టీజర్ నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12:33 గంటలకు విడుదల కానుంది. హను-మాన్ ఆయుధాన్ని చూపిస్తూ ఓ అద్భుతమైన పోస్టర్ ద్వారా మేకర్స్ టీజర్ డేట్ ని అనౌన్స్ చేశారు. పోస్టర్ లో తేజ సజ్జ చేయి కొండపైన గదను ఎత్తడం కనిపిస్తోంది. అతని చేతికి బ్రాస్‌లెట్‌, రాగి కంకణం , వేలికి రెండు ఉంగరాలు కూడా ధరించాడు. పోస్టర్ టీజర్‌పై క్యూరియాసిటీని మరింత పెంచింది.

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ ట్రాక్‌లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది . మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.

తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

నిర్మాత: కె నిరంజన్ రెడ్డి

బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్

సమర్పణ: శ్రీమతి చైతన్య

స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే

డీవోపీ: దాశరధి శివేంద్ర

సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, గౌరా హరి, కృష్ణ సౌరభ్

ఎడిటర్: ఎస్బీ రాజు తలారి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి

అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో : వంశీ-శేఖర్

కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి