చేతులు కాల్చుకోలేక వెనకడుగు వేసిన గోపీచంద్

Gopichand's Seetimar postponed

Seetimaarr

గోపీచంద్, తమన్నాల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాను ఏప్రిల్ 2న విడుదలచేయాలని ముందుగా అనుకున్నారు టీమ్. ‘వైల్డ్ డాగ్, సుల్తాన్’ సినిమాలు అదే రోజున వస్తున్నా గోపీచంద్ వెనకడుగు వేయలేదు. అనుకున్న తేదీకే వస్తామన్నట్టు ఉన్నారు. టీజర్ విడుదల చేశారు. అదేమీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా నమ్మకంతోనే ఉన్నారు. రెండవ తేదీకి ఇంకో నాలుగు రోజులే ఉంది. ఎక్కడా ప్రమోషన్ల జాడ అనేదే కనబడలేదు.

అసలు విషయమేమిటని ఆరా తీస్తే సినిమా వాయిదాపడిందని తెలుస్తోంది. పోటీ సంగతి పక్కనబెడితే అసలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాలేదట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి గ్రాఫిక్స్ కంటెంట్ ఎక్కువగానే ఉందట. అదే పూర్తికాలేదట. ఎంత గట్టిగా ట్రై చేసినా డెడ్ లైన్ అందుకోలేకపోయారట టీమ్. దీంతో హడావుడికి పోయి ఈ మూడు రోజులు ప్రమోషన్లు చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ వాయిదా వేసేశారు. ఏప్రిల్ 2న కాకుండా నెలాఖరున రావాలని చూస్తున్నారట టీమ్. మరి కొత్త విడుదల తేదీ తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.