“పక్కా కమర్షియల్” తో డే 1 గోపీచంద్ కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు.!

తెలుగు సినిమా దగ్గర హేటర్స్ అంటూ లేని అతి కొద్దీ మంది స్టార్ హీరోలలో తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే హీరో మ్యాచో మెన్ గోపి చంద్ కూడా ఒకడు. మరి గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “పక్కా కమర్షియల్” నిన్న శుక్రవారం రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ ని ఆడియెన్స్ నుంచి అందుకుంది. 

అయితే ఈ సినిమాతో మాత్రం చిత్ర యూనిట్ గోపీచంద్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేశారు. మరి వారు చెప్తున్నా దాని ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.3 కోట్ల గ్రాస్ ని అందుకుందట. ఇది గోపీచంద్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు అని చెప్పాలి. 

అలాగే ఈ సినిమా ఈ వీకెండ్ లో మరింత మంచి వసూళ్లను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే బన్నీ వాసు మరియు యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించి రిలీజ్ చేశారు.