మాస్ మహరాజా రవితేజ క్రాక్ చిత్రంతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. రవితేజ సినిమాలలో అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా క్రాక్ నిలిచిపోయింది. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకంగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ. బలుపు, డాన్ శీను, క్రాక్ చిత్రాలు రవితేజ- గోపిచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కగా ఈ మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి.
రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రవితేజకు క్రాక్ రూపంలో సూపర్ డూపర్ హిట్ దొరికింది. గోపిచంద్ మలినేనికి కూడా ఈ సినిమా కాస్త రిలీఫ్‌ని అందించింది. చివరిగా తెరకెక్కించిన విన్నర్ పెద్దగా అలరించకపోవడంతో ఈ సినిమాపై గోపిచంద్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా విజయం రవితేజ, శృతి హాసన్, గోపిచంద్ మలినేనితో పాటు పలువురు ప్రముఖులకు మంచి ఉపశమనాన్ని కలిగించింది. క్రాక్ మూవీని రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి కూడా వీక్షించారు. ఆయనకు సినిమా బాగా నచ్చడంతో ప్రశంసలు కురిపించారు.
క్రాక్ సినిమా చత్ర దర్శకుడు గోపిచంద్ మలినేనికి చాలా ప్రత్యేకంగా అని చెప్పాలి. ఈ సినిమా తనకు మంచి విజయం అందిచడమే కాక ఇందులో నటించిన తన కొడుకుకు కూడా మండి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. చిత్రంలో రవితేజపై నాన్ స్టాప్ పంచ్‌లు వేస్తూ అలరించిన బుడ్డోడు గోపిచంద్ మలినేని తనయుడు సాత్విక్ . క్రాక్‌తో వెండితెరకు పరిచయమైన ఈ కుర్రాడు తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. అతని పర్‌ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్కరు కుర్రాడికి మంచి భవిష్యత్ ఉందని అంటున్నారు. రవితేజ కొడుకుగా సాత్విక్ నటించగా, అతని పాత్ర సినిమా సక్సెస్‌లో మరో భాగం అయిందనే విషయం ఒప్పుకొని తీరాల్సిందే.