Shyam Singha Roy : ఓటిటిలో నాని సినిమా బ్లాస్ట్.. ఏకైక ఇండియన్ సినిమాగా డీటెయిల్స్ ఇవే.!

Shyam Singha Roy : గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యిన చిత్రాల్లో హిట్ గా నిలిచినవి కొన్ని ఉన్నాయి. మరి వారి వాటిలో లాస్ట్ డిసెంబర్ లో రిలీజ్ అయ్యినవే మూడు మూడు వారాల నుంచి ఉన్నాయి. అలా మూడో వారంలో వచ్చిన సూపర్ హిట్ సినిమానే “శ్యామ్ సింగ రాయ్”.

నాచురల్ స్టార్ నాని హీరోగా మరో నాచురల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘టాక్సీ వాలా’ ఫేమ్ దర్శకుడు రాహుల్ తెరకెక్కించాడు. మరి నాని కెరీర్ లోనే అధిక బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అన్ని అంచనాలు అందుకొని థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యింది.

చాలా కాలం తర్వాత నాని నుంచి వచ్చిన థియేట్రికల్ రిలీజ్ ఇది కావడం పైగా ఎన్నో అడ్డంకులు కూడా ఉన్నా ఈ సినిమా మంచి వసూళ్లు అందుకొని హిట్ అయ్యింది. ఇక తర్వాత ఓటిటి లో కూడా ఇదే హవా కొనసాగించడం విశేషం. లేటెస్ట్ గా నాన్ ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ తియ్యగా నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా టాప్ 3లో నిలిచిందట.

అంతే కాకుండా ఏకంగా 35 లక్షలకి పైగా గంటల పాటు స్ట్రీమింగ్ చేసినట్టు తెలిపారు. దీనితో శ్యామ్ సింగ రాయ్ సినిమా ఓటిటి లో కూడా ఎలాంటి హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కృతి శెట్టి నటించగా ‘ప్రేమమ్’ ఫేమ్ మడోనా కీలక పాత్రలో నటించింది.