Mahesh Sarkaru Vaari Paata : ఈ నాలుగు రోజులు మహేష్ ఫ్యాన్స్ కి పండగే..రీడినా..?

Mahesh Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “సర్కారు వారి పాట”. పక్కా మాస్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నా ఈ సినిమాని మేకర్స్ వేరే లెవెల్లో నే ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అని చెప్పాలి.

ఫైనల్ గా ఈ సాంగ్ ని చిత్ర బృందం ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చెయ్యగా ఇప్పుడు ఈ గ్యాప్ లో అదిరే అప్డేట్స్ మహేష్ ఫ్యాన్స్ కోసం సిద్ధంగా ఉన్నట్టు అధికారిక ప్రకటన అందించారు. రానున్న ఈ ఫిబ్రవరి 9, 11 మరియు 14 తేదీలను లాక్ చేసుకోమని అందరి అంచనాలు రీచ్ అవుతామని టీజ్ చేస్తున్నారు.

అలాగే ఈ సాంగ్ ని సంగీత దర్శకుడు థమన్ అదిరే లెవెల్లో ఇచ్చాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే 14న రిలీజ్ కానున్న సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా వచ్చే మే 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీస్ కానుంది.