హిట్ కోసం తహతహలాడుతున్న రవితేజకు గోపిచంద్ మలినేని క్రాక్ సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బలుపు, డాను శీను చిత్రాలు మంచి విజయం సాధించిగా,ఇప్పుడు క్రాక్ కూడా హిట్ కావడంతో హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం మాస్‌రాజా క్రాక్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాక్షసుడు ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడీ అనే చిత్రాన్ని చేస్తున్నారు.2021 జనవరి 1వ తేదీన ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేయగా, ఇందులో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించి ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని కలిగించాడు.
రవితేజ 67వ సినిమాగా రూపొందుతున్న ఖిలాడీలో రవితేజ డబుల్ ఇంపాక్ట్ చూపించనున్నాడు.ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. డా.జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ ‘ఖిలాడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కథానాయికలుగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఖిలాడీ టీమ్. ఇందులో అనసూయ కూడా ముఖ్య పాత్ర పోషించనున్నట్టు టాక్.
నెగెటివ్ షేడ్ కలిగిన పాత్ర ఖిలాడీలో ఉండగా,ఆ పాత్రకు అనసూయ అయితే సరిగ్గా సరిపోతుందుని ఆమెను సంప్రదించారట మేకర్స్. దీనికి అనసూయ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం. కట్ చేస్తే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ నుండి గ్లింప్స్ ఒకటి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. ఖిలాడీ నుండి రానున్న గ్లింప్స్ ప్రేక్షకులకు డబుల్ యాక్షన్ ట్రీట్ ఇవ్వనుందని చెబుతున్నారు.