జూలై 8న వస్తున్న ‘గంధర్వ’

సందీప్ మాధవ్, గాయత్రి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గంధర్వ’ . ఇటీవలి కాలంలో క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న ‘గంధర్వ’ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పిస్తోంది.

ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు, ట్రైలర్ ఇప్పటికే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.

ఇక గంధర్వ ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్, హీరో సందీప్ మాధవ్ చెప్పిన విశేషాలు మార్కెట్ లో సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. అద్భుతమైన కొత్త పాయింట్ తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు అప్సర్ సిద్దమవుతున్నారు. జూలై 8 న థియేటర్లలో విడుదల కాబోతుంది.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం రాప్ రాక్ షకీల్ అందించారు. సినిమాటోగ్రఫీ జవహర్ రెడ్డి అందించగా ఎడిటర్ గా బసవా పైడి రెడ్డి వ్యవహరించారు.