అధికారపక్షం-ప్రతిపక్షం నేతలు మధ్య మాటల యుద్ధం సహజమే. సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల నేతలు ఒకర్ని ఒకరు విమర్శించుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, దుర్భాషలాడుకోవడం జరుగుతుంటుంది. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాకే పరిమితం. అలాగే ఆ రెండు పార్టీల మధ్య అభిమానులు, కార్యకర్తలు అదే సోషల్ మీడియాలో ఫైటింగ్ లు చేసుకోవడం అంతే సహజం. అభిమానులు ఎవరూ నేరుగా నేతల్ని టార్గెట్ చేయడం అన్నది చాలా రేర్. కానీ ఓ ఫ్యాన్ మాత్రం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితను గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అనితను ఉద్దేశించి ఓ అభిమాని అభ్యంతరకర ట్వీట్ ఒకటి పెట్టాడు.
సోషల్ మీడియాలో అనిత మంచి స్పీడ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెను ఏమని ఉద్దేశించాడంటే? ఓ నెటిజన్ ఆంటీకి మందు అలవాటు బాగా ఉన్నట్లుందని కామెంట్ చేసాడు. అయితే ఆ అభిమాని ఇక్కడ ఆంటీ అన్నాడు గానీ ఆమె పేరు చెప్పలేదు. అయినా అనిత ఆ విషయాన్ని లైట్ తీసుకోలేదు. అందుకు ఘాటుగానే బధులిచ్చింది. అవును తమ్ముడు. నేను మీ అమ్మ కలిసి మందు తాగుతామని రీట్వీట్ చేసింది. ఇంతకీ ఆ కామెంట్ నెటి జన్ ఎందుకు చేసినట్లు అంటే? ఆల్కాహాల్ గురించి అనిత కామెంట్ చేయగా ఆ నెటిజన్ ఆంటీకీ అలవాటు ఉందని పోస్ట్ చేసాడు.
అందుకే అనిత అంత వేగంగా అందుకుంది. అవును తమ్ముడు మీ అమ్మగారు హాఫ్ తాగితే…నేను క్వార్టర్ తాగుతా అని మండిపడింది. దెబ్బకి ఆ నెటి జన్ కి సౌండ్ లేదు. ఇక అనిత గతంలో పాయకరావుపేట నియోజక వర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అదే నియోజక వర్గం నుంచి చంద్రబాబు బరిలోకి దించాలని చూసారు. కానీ ఆ నియోజక వర్గం ఎలాంటి అభివృద్ధి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసారు. ఎన్నికలకు ముందు గ్రామాల పర్యటన చేపట్టాలని ప్లాన్ చేసింది. కానీ ఓ ఊరు గ్రామస్థులు ఆగ్రహించి ఏకంగా దాడికే యత్నించారు. చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించి అనితను అక్కడ ఉంచితే లాభం లేదని తూర్పు గోదావరి జిల్లా నుంచి బరిలోకి దించారు. కానీ అక్కడా ఓడిపోయింది.
అవును తమ్ముడు, మీ అమ్మగారు,నేను కలిసే తాగుతామ్. మీ అమ్మ హాఫ్ తాగితే నేను క్వార్టర్ తాగుతా. నా కడుపున సంస్కారం లేని వెధవ పుట్టాడమ్మా అని ప్రతిరోజు ఏడుస్తారు…. సన్నాసి ఏమి భాషరా అది…ఇలానే పెంచారా నిన్ను మీ ఇంట్లో… https://t.co/ZiNgC90Pda
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 26, 2020