టాలీవుడ్ లో ఊహించని విధంగా అందరికీ హృదయం ముక్కలు చేసిన వార్త టాలీవుడ్ ఆడియెన్స్ మోస్ట్ లవబుల్ కపుల్ అక్కినేని నాగ చైతన్య మరియు సమంతా ల పెళ్లి జోడి విడాకులు తీసుకోవడం. మరి ఈ వార్తే పెద్ద సంచలనం అనుకుంటే తర్వాత సామ్ పై వచ్చిన నిందలు ఆరోపణలు అన్నీ ఇన్ని కావు.
అయితే తమ విడాకులు అనౌన్స్ చేసిన రోజున తాము వైవాహికంగా కలిసి ఉండకపోయినా మంచి ఫ్రెండ్స్ గా కలిసి ఉంటామని చెప్పుకొచ్చారు. పైగా వీళ్లది ప్రేమ వివాహం కూడా. అయినా ఈరోజు నాగ చైతన్య బర్త్ డే అయినా కూడా తన నుంచి మాత్రం ఎలాంటి బర్త్ డే విషెష్ రాకపోవడం ఆసక్తిగా మారింది.
జస్ట్ క్యాజువల్ గా కూడా సామ్ విషెష్ చెప్పకుండా స్కిప్ చెయ్యడం వీరి అభిమానులకు కాస్త బాధ కలిగిస్తుంది. మరి వీరి విడాకుల తర్వాత తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ చాలా పర్శనల్ గా తీసుకుందో ఏమో కానీ ఇప్పటి వరకు అయితే సామ్ చైతూకి ఎలాంటి విషెష్ చెప్పిన పోస్ట్ పడలేదు. మరి అధికారికంగా కాకపోయినా అనధికారికంగా చెప్పిందేమో వారికే తెలియాలి.