ఫైనల్ గా “పుష్ప” ని డామినేట్ చేసేసిన రష్మికా.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలాగే రష్మికా మందన్నా లతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. మొదటి సారి అయినా రెండు భాగాలుగా ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా పాటను రిలీజ్ చేస్తుండగా నిన్న రష్మికా వెర్షన్ మాస్ సాంగ్ ‘సామి సామి’ రిలీజ్ చేశారు.

అయితే ఈ సాంగ్ కి దీనికి ముందు పుష్ప రాజ్ పై వచ్చిన రెండు సాలిడ్ సొంగ్స్ కన్నా భారీ రావడం గమనార్హం. అవి కూడా పెద్ద హిట్స్ అయినా ఫైనల్ గా డామినేషన్ ఆడవాళ్లదే అన్నట్టు తన శ్రీవల్లి దగ్గర పుష్ప రాజ్ ఇక్కడ కూడా తలొగ్గక తప్పలేదు. ముందు దాక్కో దాక్కో మేక సాంగ్ కి 24 గంటల్లో 8.35 మిలియన్ వ్యూస్ రాగా 9.06 మిలియన్ వ్యూస్ తో భారీ ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ఇది కూడా “రంగస్థలం” లోని ఓ సాంగ్ లా ఉందని టాక్ ఉన్నా దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్ బాగానే వర్కౌట్ అయ్యింది.