Sarkaru Vaari Paata : ఇన్సైడ్ టాక్ : “సర్కారు వారి పాట” రిలీజ్..ఫైనల్ గా నిర్మాతలే గెలిచారా?

Sarkaru Vaari Paata : ఏ స్టార్ హీరో అభిమానికి మాత్రం ఉండదు తన హేరియ వరుస హిట్స్ కొట్టాలని.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక బ్యాడ్ ఫేజ్ లో ఉన్నపుడు వరుసగా ఏకంగా మూడు భారీ హిట్స్ సొంతం చేసుకున్నాడు.
తన హిట్ రేషియో పరంగా మహేష్ బాబు ఎంత జాగ్రత్తగా ఉంటాడో తెలిసిందే.
అలాగే ఈ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మళ్ళీ మరో హిట్ అందుకోవాలని పక్కా ప్లానింగ్ ప్రకారం చేస్తున్న సినిమానే “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్లతో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయి అంచనాలు అభిమానులు పెట్టుకున్నారు.
అయితే ఇదంతా బాగానే ఉంది కానీ లాస్ట్ లో మహేష్ బాబు సినిమా క్వాలిటీ పరంగా సినిమాని ఓసారి వాయిదా వేసి మంచి అవుట్ ఫుట్ తో రిలీజ్ చేద్దామని నిర్మాతలకి సూచించగా వారు మాత్రం అనుకున్న డేట్ కే రిలీజ్ చేద్దామని చెప్పినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వచ్చింది.
కానీ ఫైనల్ గా మాత్రం ఈ యుద్ధంలో నిర్మాతలదే పై చేయి అయ్యినట్టుగా ఇప్పుడు సమాచారం. దీనితో ఈ సినిమా అనుకున్న డేట్ మే 12నే రిలీజ్ చెయ్యడం ఖాయం అని ఇప్పుడు వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్. ఇంకా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్నాడు.
అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.