ఫైనల్ గా “ఆచార్య” అవైటెడ్ బిగ్ అప్డేట్ వచ్చేసింది.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సినిమా “ఆచార్య”. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఇంకో హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఎప్పుడో చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యాలని ఎదురు చూస్తున్న అప్డేట్ ఈ సినిమా రెండో సాంగ్ పై అప్డేట్ ని మేకర్స్ ఎట్టకేలకు ఈరోజు ఇచ్చారు.

సంగీత దర్శకుడు మణిశర్మ ఇచ్చిన బ్యూటిఫుల్ వింటేజ్ సెకండ్ సాంగ్ ‘నీలాంబరి’ ని వచ్చే నవంబర్ 5 రోజున దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఓ బ్యూటిఫుల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేసారు. ఈ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా అది ఇప్పుడు వస్తుంది. మరి ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.