Sarkaru Vaari Paata : ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే “సర్కారు వారి పాట” బిగ్ అప్డేట్ వచ్చేసింది.!

Sarkaru Vaari Paata : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న తాజా సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. వరుసగా మూడు భారీ హిట్స్ అందుకున్న తర్వాత మహేష్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ స్థాయి అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. మరి వాటికి తగ్గట్టుగానే దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సంగీతం పట్ల కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది వరకే మహేష్ తో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సూపర్ హిట్స్ కాగా ఈ సినిమాపై కూడా అంతే అంచనాలు ఉన్నాయి.
అలాగే వచ్చిన ఫస్ట్ సాంగ్ కళావతి సెన్సేషనల్ హిట్ కాగా రెండో సాంగ్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న అభిమానులకి ఇప్పుడు చిత్ర బృందం బిగ్ అప్డేట్ ని ఇచ్చేసారు. ఈ రెండో సాంగ్ కి “పెనీ” అని టైటిల్ ని పెట్టి ఈ మాస్ సాంగ్ ని ఈ వచ్చే మార్చ్ 20న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ లాక్ చేశారు.
దీనితో మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సాంగ్ డేట్ ఫిక్స్ అయ్యినట్టు అయ్యింది. మరి ఈ సాంగ్ ఎలాంటి బీట్స్ ని థమన్ సమకూర్చాడో చూడాలి. ఇంకా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ వారు నిర్మాణం వహించారు.
https://twitter.com/MythriOfficial/status/1504316114817683459?s=20&t=AdHWmNKAg3vYTrV5y1if5A