దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఎప్పుడూ వార్తల్లో ఉండే హీరోయిన్ నయనతార. సినిమాలు, రెమ్యునరేషన్, వ్యక్తిగత విషయాలు ఇలా ఏదో ఒక కారణం మీద ఆమె గురించి చర్చకు నడుస్తూనే ఉంటాయి. నయన్ అభిమానులను ఎప్పుడూ కలవరపెట్టే అంశం ఆమె వివాహం. ఇప్పటికే ఇద్దరితో లవ్ బ్రేకప్ అయిన ఆమె ప్రజెంట్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. వీరి లవ్ జర్నీ చాలా ఏళ్లుగా సాగుతోంది. నయన్ గత లవ్ స్టోరీల కంటే ఇది కొంచెం గట్టి స్టోరీనే. ఇప్పటివరకు వీరిమధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అందుకే ఇద్దరూ కలిసి ఉన్నారు.
ఇక వీరి పెళ్లి విషయానికి వస్తే అప్పుడు ఇప్పుడు అంటూ పలుసార్లు వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఇంతవరకు అది జరగలేదు. విగ్నేష్ శివన్ తరచూ నయనతారతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. వాటిని చూసినప్పుడల్లా వీరి పెళ్లి ఎప్పుడు అనే చర్చ మొదలవుతుంది. తాజాగా కూడ విగ్నేష్ నయన్ తో కలిసి ఉన్న ఫోటోతో పాటు నయన్ చేతికి తొడిగి ఉన్న రింగ్ ఫోటోను పెట్టాడు. అది చూసి వీరిద్దరికీ నిశ్చితార్థం అయిపోయిందా లేకపోతే ఏకంగా పెళ్లే అయిపోయిందా అనే కంగారుపట్టుకుంది అభిమానులకు.
వాస్తవంగా మాట్లాడుకుంటే నయనతారకు పెళ్లి అనేది పెద్ద మ్యాటరే కాదనిపిస్తోంది. ఎందుకంటే ఒక్క పెళ్లి అనే విషయాన్ని పక్కనపెడితే ఇద్దరూ భార్యాభర్తల్లానే ఉంటున్నారు. కలిసి పండుగలు జరుపుకుంటారు. విదేశీ టూర్లకు వెళుతుంటారు. షూటింగ్స్ లేని టైమ్ అంతా కలిసే ఉంటారు. ఇలా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా సంతోషంగా కలిసున్న ఈ ప్రేమ జంటకు పెళ్ళి అనేది అంత ముఖ్యమైన విషయం ఎందుకవుతుంది. కాబట్టి నయన్ ఫ్యాన్స్ కూడ వీరి పెళ్లి గురించి ఆలోచించడం మానేస్తే బెటర్.