Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక అభిమాని చేసిన పనికి ఫ్యాన్స్, నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం నలగొండరాయని పల్లికి చెందిన రామకృష్ణ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి పై ఉన్న అభిమానంతో చిరు ప్రతి సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవారు రామకృష్ణ. చిరంజీవిని కలిసేందుకు ఇప్పటికే 20, 30 సార్లు ప్రయత్నం చేశారు.
కానీ ఎంత ప్రయత్నించినా మెగాస్టార్ చిరంజీవి కలవకపోవడంతో ఆయనను కలిసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిరంజీవిని కలవడమే తన చివరి కోరిక అని నిర్ధారించుకున్న అతడు ఏకంగా నిరాహారదీక్ష చేపట్టాడు. చిరంజీవి కోసం టెంట్ వేసుకుని నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. తన నిరాహార దీక్షతో అయినా చిరంజీవి కలుస్తాడని రామకృష్ణ ధీమాతో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసి తాను రాసిన జానపద కథ స్క్రిప్ట్ చిరంజీవికి చెప్పి ఒప్పించి చిరుతో సినిమా తీయాలని ఉందని అంటున్నారు అభిమాని రామకృష్ణ. మెగాస్టార్ చిరంజీవిని కలిసే వరకు నిరాహార దీక్ష ఆపేది లేదని ప్రాణం పోయినా పర్లేదు అంటున్నారు అభిమాని రామకృష్ణ. 30 ఏళ్ల వయసు నుంచి మెగాస్టార్ చిరంజీవికి అభిమానిగా ఉన్న రామకృష్ణ. ఇప్పుడు తనకు 60 ఏళ్ళ వయస్సు వచ్చినా చిరంజీవిని కలవకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడట. వీరాభిమాని రామకృష్ణకు చిరు అంటే ఎంత అభిమానమో అనుకుంటున్నారు ఇది తెలిసిన వారు. మరి ఈ వ్యవహారం గురించి చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.