ఇతర భాషల్లో పేరున్న నటీనటులను ఆడినంత ఇచ్చి తెలుగులోకి తీసుకురావడం మన తెలుగు నిర్మాతలకు బాగా అలవాటు. అది ఈమధ్య మరీ ఎక్కివైంది. తమిళంలో బాగా పాపులారిటీ సాధించిన విజయ్ సేతుపతిని అలాగే తీసుకొచ్చారు. విజయ్ సేతుపతి అన్ని ప్రధాన భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. అందుకే ఆయన రెమ్యునరేషన్ భారీగా ఉంటోంది. ఈమధ్యే వచ్చిన ఉప్పెనలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా కోసం ఆయనకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీగానే ముట్టజెప్పారు. సేతుపతి దగ్గర దగ్గర 3 కోట్ల వరకు అందుకున్నారని టాక్.
ఒక పర భాషా నటుడికి ఈ స్థాయిలో పారితోషకం ఇవ్వడం ఇదే మొదటిసారి. అది కూడ కొద్దిరోజుల డేట్స్ కోసమే. సేతుపతి విషయంలోనే ఆశ్చర్యపోతే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ అంతకు రెట్టింపు వసూలు చేస్తున్నాడటా. ఫహాద్ ఫాజిల్ మలయాళంలో స్టార్ హీరో. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటాడు. తెలుగులో సైతం ఆయన మీద మంచి నటుడు అనే అభిప్రాయం ఉంది. అందుకే పుష్ప సినిమాకు పట్టుబట్టి మరీ అతన్ని తెచ్చుకున్నారు. ఇష్టపడి తెచ్చుకున్నాక అడిగినంత ఇవ్వాలి కదా. అలాగే ఇస్తున్నారట. అతనికి చెల్లిస్తున్న రెమ్యునరేషన్ విజయ్ సేతుపతి కంటే ఎక్కువేనని, తెలుగులో విలన్ రోల్స్ చేసే ఏ నటుడికీ ఇంత మొత్తం ఇచ్చింది లేదని అంటున్నారు.