Fafam Varma : ఫాఫం వర్మ.! దిగజారడంలో తగ్గేదె లె.!

Fafam Varma : ‘ఆచార్య’ సినిమా నుంచి లేటెస్టుగా ఓ వీడియో రిలీజ్ చేశారు.మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు, డైరెక్టర్ కొరటాల శివ ఆ వీడియోలో కనిపిస్తున్నారు. సరదాగా కూర్చొని సినిమాలోని ఓ పాట కోసం ఫన్నీగా మాట్లాడుకుంటున్న వీడియో అది.

చిరంజీవి, చరణ్ డాన్సుల విషయమై తండ్రీ కొడుకులు, ‘నువ్వు తగ్గు.. నేను తగ్గను..’ అంటూ ఓ ఫన్నీడిస్కషన్ జరిగింది అక్కడ.

స్పాంటేనియస్‌గా చిరంజీవి క్రియేట్ చేసిన సరదా సంభాషణ అది. ఆ ఫన్నీ సంభాషణా వీడియో మెగా ఫ్యాన్స్‌కి భలే ఉత్సాహాన్నిచ్చింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.

రామాయణంలో పిడకల వేట అన్నట్లుగా రాలుగాయి రామ్ గోపాల్ వర్మ ఈ సంభాషణను వక్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సంభాషణను అల్లు ఫ్యామిలీకీ, మెగా ఫ్యామిలీకి మధ్య పుల్ల పెట్టేసేందుకు వాడేసుకున్నాడు. చిరంజీవి మాటలు నన్ను హర్ట్ చేశాయంటూ, అర్ధం పర్ధం లేకుండా అల్లు ఫ్యామిలీని కెలికాడు.

 ‘పుష్ఫ’ సినిమాలోని ‘తగ్గేదె లే..’ అన్న డైలాగ్‌తో ఆ సినిమా టైమ్‌లోనే ఈ ప్రయత్నం చేశాడీ మహానుభావుడు. కానీ అప్పుడు పారలేదు. మళ్లీ ఇఫ్పుడు ఇలా ట్రై చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీపైనే కాదు, టాలీవుడ్‌లో ఎవరు సక్సెస్‌ఫుల్ పొజిషన్‌లో వున్నా వాళ్లపై పడి ఏడవడమే వర్మ పనిగా పెట్టుకున్నాడు.

తన సినిమాలను రిలీజ్ చేసుకోవడం చేత కాక, ఇదిగో ఇలాంటి ఏడుపు యవ్వారాల్లో బాగా ఫోకస్ పెడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ.. సారీ సారీ వివాదాల వర్మ. అమ్మో.! ఆయన పేరుకు ముందు ఆ ట్యాగ్ లేకపోతే ఇంకేమైనా వుందా.? మళ్లీ హర్టవుతాడు. సిగ్గు లేకుండా.!