‘ఎఫ్3’ 8 వారాల థియేట్రికల్ రన్‌ లోపు ఓటీటీలో రిలీజ్ కాదు

‘F3’ నిర్మాతలు సినిమా ఓటీటీ విడుదలపై మొదటి నుండి చాలా స్పష్టంగా వున్నారు. థియేట్రికల్ విడుదల తర్వాత కొన్ని వారాల్లోనే సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ లోనూ విడుదల కాదని F3 నిర్మాతలు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. 8 వారాల థియేట్రికల్ రన్‌ కు ముందు, F3 స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫారమ్‌ లలో విడుదల కాదని మరోసారి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ” ఎఫ్ 3ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఎఫ్ 3ని థియేటర్ లో చూడకపోయినా నాలుగు వారాల్లో ఓటీటీకి వస్తుందని అనుకున్నారు కదా.. ఇట్స్ నాట్ కమ్మింగమ్మా .. నాలుగు వారాల్లో రాదమ్మా..ఎనిమిది వారల తర్వాతే వస్తుందమ్మా .. రెండు నెలల తర్వాత ఓటీటీకి వస్తుంది., సో అందరూ థియేటర్ కే వచ్చి ఎఫ్ 3ని చూసి ఈ సమ్మర్ లో సరదాగా నవ్వుకోండి” అని వెల్లడించారు.

ఈ ప్రకటనతో సినిమాను చూడని వారు థియేటర్‌కి వచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేయడంతో పాటు, సినిమాని ఇప్పటికే చూసి ఇష్టపడిన వారు మరోసారి చూడటానికి ఓటీటీ విడుదల కోసం ఎదురుచూడకుండా థియేటర్ కి వచ్చి మరోసారి ఎఫ్ 3 ఫన్ రైడ్ ని ఎంజాయ్ చేస్తారని చెప్పాలి.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఎఫ్ 3లో తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలలో అలరించారు.