“ఎఫ్ 3” ట్రైలర్ టాక్.. ఈసారి ఆడియెన్స్ కి నసా లేక భరోసానా?? చూద్దాం రండి

F3 trailer : ఒక్క మన తెలుగు సినిమాల్లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇతర ఇండస్ట్రీలలో సీక్వెల్స్ పెద్దగా అచ్చి రాలేదు. ఎక్కడో వెళ్ల మీద లెక్కబెట్ట గలిగేలా అరకొర సినిమాలు పైగా భారీ సినిమాలకి హిట్స్ పడ్డాయి తప్ప మిగతా సినిమాలు అన్నీ ప్లాప్ లే అయ్యాయి. మరి ఇప్పుడు అలాంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు మన తెలుగు నుంచి రాబోతుంది.

ఆ సినిమా నే విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం “ఎఫ్ 3”. మొదటి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ కాదు గాని అదే ఫ్రాంచైజ్ లో అదే నటీనటులు తో తీశారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తూండగా మేకర్స్ ఆ ట్రైలర్ ని వదిలారు.

అయితే ఇది ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఫస్ట్ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. దీనితో చాలా మంది నస గా ఫీల్ అయ్యారు. పైగా సీక్వెల్ అనేసరికి ఇంకా చికాకు పడ్డారు. అయితే వారికి కూడా ఇప్పుడు “ఎఫ్ 3” మంచి ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుంది. ముందు సినిమా కన్నా ఈ సినిమా కొంచెం మంచి ఫన్ ఉండేలా ట్రైలర్ చూసాక అనిపిస్తుంది.

ఇంకా చెప్పాలంటే కొన్నాళ్ల కితం రాజేంద్రప్రసాద్ శ్రీకాంత్ లాంటి హీరోలు కలిపి చేసిన ఫ్యామిలీ కామెడీ డ్రామాల తరహాలో ఈ సినిమా ఉండేలా అనిపిస్తుంది. ఇంకా ఇద్దరు హీరోలకి చిన్న లోపాలు దర్శకుడు పెట్టడం బాగుంది. అలాగే డబ్బుతో వచ్చే ఇబ్బందులు వాటి నుంచి కూడా మంచి ఫన్ ని అనీల్ రావిపూడి చూపిస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఇది నిజంగా ఫస్ట్ సినిమా మీద బెటర్ అని మాట నమ్మకం కలిగిస్తున్నాయి. అలాగే హీరోయిన్ లు తమన్నా మరియు మెహరీన్ లు కాస్త కామెడీ డోస్ పెంచడంతో పాటు గ్లామర్ కూడా బాగానే చూపించారు.

ఇది మంచి విషయం అలాగే తన మార్క్ కొన్ని పాత డైలాగ్స్ తో మంచి ట్రీట్ ని అయితే ఈ ట్రైలర్ ఇచ్చింది. ఫైనల్ గా అయితే గత సినిమా కంటే చాలా బెటర్ గా ఈ సినిమా ఉండేలా అనిపిస్తుంది. ఇక ఈ క్రేజీ సీక్వెల్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ మే 27 వరకు ఆగి చూడాలి. ఇంకా ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం అందించారు.

F3 Trailer | Venkatesh, Varun Tej | Anil Ravipudi | DSP | Dil Raju | In Theatres May 27th