F3: పూర్తి అయిన ఎఫ్ 3 సినిమా షూటింగ్ విడుదల..ఎప్పుడో తెలుసా?

F3: టాలీవుడ్ హీరోస్ విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్3. ఇందులో తమన్నా, మెహరిన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్,సునీల్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అన్న సస్పెన్స్ మొదలయ్యింది. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయానికి కాస్త అటు ఇటు చేస్తాం కానీ చేయడం మాత్రం పక్క అంటూ ప్రకటించారు. ఇప్పటికే విడుదల అయిన ఎఫ్2 సినిమా భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం అందరికి తెలిసిందే. ఎఫ్ 3 సినిమాపై కూడా ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాపై ఏ మాత్రం అశ్రద్ధ చూపించకుండా 100 కోట్లకు మించి వసూలు దక్కించుకునే విధంగా మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ చేశారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ కరోనా మహమ్మారి వల్ల పలు సార్లు వాయిదా వేస్తూ వచ్చారు. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల విడుదల తేదీ వాయిదా వేశారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా అంతకుమించి ఉంటుంది అని ప్రేక్షకుల అంచనాలు వేసుకున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి మరి.