“ఎఫ్ 3” లో అందరి స్టార్ హీరోల ఫాన్స్ కి ఫుల్ మీల్స్ తో ట్రీట్..!

F3 Movie

ప్రస్తుతం మన టాలీవుడ్ లో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “ఎఫ్ 3”. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాలో తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించారు. మరి దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ఎఫ్ 2 కి సక్సెసర్ గా తీసిన ఈ చిత్రంని తీశారు.

మరి ఈ చిత్రానికి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ఫస్ట్ డే ఫస్ట్ షో ని ఓవరాల్ వరల్డ్ వైడ్ అందుకుంది. అయితే ఈ సినిమాలో కామెడీ ట్రీట్ పక్కన పెడితే నిర్మాత దిల్ రాజు చెప్పినట్టుగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరికీ ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పారు. మరి ఇప్పుడు షోలు పడ్డాక ఇతర హీరోల అభిమానుల్లో ఆ సీన్స్ మరియు రిఫరెన్స్ ల కోసమే మాట్లాడుకోవడం చర్చగా నడుస్తుంది.

మొత్తానికి అయితే ఈ సినిమాతో అందరి హీరోల ఫ్యాన్స్ కి మంచి ఫుల్ మీల్స్ ని పెట్టేశారని చెప్పాలి. ఇంకా ఈ ఫన్ ఎంటర్టైనర్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం అందించాడు. మరి ఈ సినిమాతో దిల్ రాజు ఎంత లాభాలు గడిస్తాడో అని టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది.