సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ఏమంటున్నారంటే..?

తెలుగు సినీపరిశ్రమలో ‘నటశేఖర’గా వెలుగొందిన సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు మీడియాకు వివరాలను వెల్లడించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్‌ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణకు గుండెపోటు రావడంతో అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కృష్ణకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా, ఆయన ఆరోగ్యం కొద్దిగా నిలకడగా ఉందని చెప్పారు. క్రిటికల్‌ స్టేజ్‌లో అందరూ డాక్టర్‌లు కలిసి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కృష్ణ రాగానే ఎమర్జెన్సీకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు, ప్రస్తుతం కృష్ణ క్రిటికల్‌ స్టేజ్‌లోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ఆయన చాలా రోజులుగా మా దగ్గర చికిత్స తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.

ఇదిలా ఉండగా .. సూపర్‌ స్టార్‌ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో మహేష్‌ బాబు భార్య నమ్రత, కృష్ణను గచ్చిబౌలీలోని కాంటినెంటల్‌ హస్సిటల్‌లో చేర్చారు అని కాంటినెంటల్‌ వైద్యులు మీడియాకు తెలిపారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ‌కి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వయస్సు పైబడిన కారణాలే ఆయన అనారోగ్యానికి కారణమని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఘట్టమనేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సూపర్‌స్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా.. కొన్ని నెలల క్రితం ఆయన కుటుంబానికి సంబంధించిన ఓ వేడుకలో కృష్ణ పాల్గొన్నారు. దానికి సంబంధించిన పిక్ ఒకటి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఆయన ముఖంపై మచ్చలు కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉందా అని ఆరా తీశారు. అనంతరం కృష్ణ ఆరోగ్యంపై ఆయన సన్నిహితులు స్పందించి ఆయన హెల్త్‌పై అప్‌డేట్ ఇచ్చారు. ఆయన ట్రాన్ఫరెంట్ మాస్క్ ధరించడం వల్ల అలా కనిపించింది తప్ప ఆయన ముఖంపై ఎటువంటి మచ్చలు లేవని చెప్పుకొచ్చారు. దాంతో.. ఘట్టమనేని అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం కృష్ణ సతీమణి మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మరణించడంతో ఒక్కసారిగా మహేష్ బాబు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఏడాదిలోపే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అలాగే తల్లి ఇందిరా దేవి మరణించడం ఘట్టమనేని కుటుంబానికి తీరని లోటని చెప్పాలి. ఇంకా తన తల్లి మరణ వార్త నుంచి మహేష్ బాబు కుటుంబ సభ్యులు బయటపడక ముందే తిరిగి తన తండ్రికి అనారోగ్యం చేయడంతో మహేష్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తల రావడంతో ఆయన క్షేమంగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇకపోతే కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులందరూ ఇప్పటికే కాంటినెంటల్ హాస్పిటల్ కు చేరుకున్నారు. మొత్తం మీద సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటనతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.