చరణ్ సంస్కారం చూసి సిగ్గేసిందన్న స్టార్ డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ గురించి సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు గొప్పగా చెబుతారు. మెగాస్టార్ కొడుకైనా రామ్ చరణ్ ఆ గర్వాన్ని ప్రదర్శించరని చాలామంది అభిప్రాయపడతారు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒకే విధంగా ఉండే హీరోలలో రామ్ చరణ్ ఒకరని చెప్పవచ్చు. రామ్ చరణ్ కు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో ఉంది.

ఎవరైనా రామ్ చరణ్ గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తే రామ్ చరణ్ అభిమానులు అస్సలు తట్టుకోలేరు. ట్రోల్ చేసే వాళ్లకు ధీటుగా సమాధానాలను ఇచ్చే విషయంలో చరణ్ అభిమానులు ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. చరణ్ ఎంతోమందికి సహాయం చేస్తున్నా ఆ సహాయాలను ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడరు. పబ్లిసిటీకి దూరంగా ఉండే అతికొద్ది మంది హీరోలలో రామ్ చరణ్ ఒకరు కావడం గమనార్హం.

ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ చనిపోక ముందు ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ చరణ్ గురించి చెప్పిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తేజ్ ఒక ఫంక్షన్ లో నడుచుకుంటూ వస్తున్నారని నన్ను చూసి నిలబడి నమస్తే బాగున్నారా అని అడిగారని రామ్ చరణ్ సంస్కారం గొప్పదని ఆయన తెలిపారు. అల్లు అరవింద్ కు అక్కడ తాను అవార్డ్ మగధీర సినిమా కోసం ఇచ్చానని ఆయన తెలిపారు.

ఈతరం హీరోలలో చాలామంది హీరోలు ఇతరులకు పెద్దగా గౌరవం ఇవ్వరు. కానీ రామ్ చరణ్ మాత్రం పెద్దల పట్ల ఎంతో గౌరవంగా వ్యవహరిస్తారని ఇ.వి.వి. సత్యనారాయణ పరోక్షంగా చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.