ఏం మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఆ సినిమాతో ప్రేక్షకులను మాత్రమే కాకుండా నాగచైతన్యని కూడా మాయ చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు సమాచారం. అయితే చాలా కాలం ప్రేమించుకున్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో వివాహబంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందిన వీరు మనస్పర్థల కారణంగా వివాహం జరిగిన మూడు సంవత్సరాలకే విడిపోయారు. వీరు విడాకులు తీసుకొని ఇప్పటికే 9 నెలలు గడిచినా కూడా వీరిద్దరూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
విడాకుల తర్వాత ఇద్దరూ వారి కెరీర్లో చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంటే.. నాగచైతన్య కూడా సినిమాలు వెబ్ సిరీస్ ల తో బిజీగా ఉన్నాడు. సమంత తో విడిపోయిన తర్వాత బంగార్రాజు సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగచైతన్య ఇప్పటికేరెండు సినిమాలలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ధూత అనే వెబ్ సిరీస్ లో కూడా నెగటివ్ రోల్ చేస్తున్నాడు. అయితే సమంత కూడా స్టార్ హీరోయిన్ మంచి గుర్తింపు పొందిన కూడా ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ చేసి ప్రేక్షకుల ప్రశంశలు పొందింది. వీరిద్దరు మనస్పర్థలు కారణంగా విడిపోయినా కూడా ఈ విషయంలో మాత్రం సమంత, నాగచైతన్య ఇద్దరు సేమ్ టూ సేమ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత తెలుగులో నటించిన రెండు సినిమాలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.మరొక వైపు తమిళ్, హిందీ భాషల్లో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య నటించిన “థాంక్యూ” సినిమా జులై నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. నాగచైతన్య నటించిన మరొక సినిమా
“లాల్ సింగ్ చద్దా” ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే నాగచైతన్య రేంజ్ మరింత పెరుగుతుంది. అంతేకాకుండా నాగచైతన్య రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలలో ఏదో ఒకటి హిట్ అయినా కూడా నాగచైతన్య రెమ్యూనరేషన్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.