Eesha Rebba Dreaming About Big : ఈషా రెబ్బా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా.?

Eesha Rebba Dreaming About Big

Eesha Rebba Dreaming About Big :  ‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘అమీ తుమీ’ తదితర సినిమాలతో హీరోయిన్‌గా పాపులర్ అయిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బ. అసలు సిసలు తెలుగందం. అవకాశాలు అరుదుగానే వున్నా, పాపులారిటీలో పాప టాప్ లెవల్ అని చెప్పక తప్పదు.

టాలెంట్ వున్న నటి. బిగ్ ఆఫర్లు పట్టలేకపోతోంది. కానీ, ఒక్కసారి ఛాన్స్ దొరికితే దున్నేసే సత్తా వుంది. అయితే, టైమ్ కలిసి రావడం లేదంతే. యంగ్ టైగర్ ఎన్టీయార‌తో ‘అరవింత సమేత..’ వంటి పెద్ద సినిమాల్లో నటించినా ఈషా రెబ్బకు అదేమంత కలిసి రాలేదనే చెప్పాలి.

ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళ, మలయాళ సినిమాల్లోనూ ఛాన్సులు దక్కించుకుంటోంది. అలాగే, డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా సత్తా చాటుతోంది. ఇటీవల ఈషా రెబ్బ నటించిన ‘3 రోజెస్’ అను వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

కాగా, ఈ ముద్దుగుమ్మకి హారర్ కామెడీ సినిమా చేయాలన్నది డ్రీమ్ అట. మంచి కథతో అలాంటి కాన్సెప్ట్ దొరికితే ఖచ్చితంగా చేస్తానంటోంది. అలాగే ఓ సైంటిఫిక్ మూవీస్ అన్నాఈషా రెబ్బకి చాలా ఇష్టమట.

కెరీర్‌లో ఒక్కసారైనా ఆ తరహా కాన్సెప్టు చిత్రాల్లో నటించాలన్నదే తన లక్ష్యం అంటోంది ఈషా రెబ్బ. వెండితెరపైనే కాదు, ఓటీటీ చానెల్ అయినా అలాంటి అవకాశమొస్తే, అస్సలు వదులుకోనంటోంది అందాల భామ ఈషా రెబ్బ.