చిరంజీవి నుండి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న దేవి శ్రీ.. ఆనంద‌లో రాక్‌స్టార్..!

మెగాస్టార్ చిరంజీవి నుండి ప్ర‌శంస కాని లేదంటే గిఫ్ట్ కాని అందిందంటే అందులో ఉండే కిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవిని క‌నీసం ద‌గ్గ‌ర నుండైన చూస్తే చాలు అని అనుకుంటున్న స‌మ‌యంలో ఆయ‌న నుండి స‌ర్‌ప్రైజ్ వ‌స్తే ఆ కిక్కే వేర‌ప్పా. అయితే త‌న అద్భుత‌మైన సంగీతంతో సంగీత ప్రియుల‌ని రంజింప‌జేస్తున్న రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఆ అరుదైన అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవిన ఉండి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ పొందాడు. ఆ విష‌యాన్ని స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియాలో తెలియ‌జేశాడు.

హీరో, భాష‌తో సంబంధం లేకుండా అద్భుత‌మైన స్వ‌రాలు స‌మ‌కూరుస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్రసాద్. ఆయ‌న అందించే బాణీల‌లో ఎంత జోష్ ఉంటుందో దేవి శ్రీ మాట‌ల‌లోను అదే జోష్ ఉంటుంది. దేవి శ్రీ స్టేజ్ ఎక్కాడంటే ఇక ఆ కార్య‌క్ర‌మం ద‌ద్ద‌రిల్లాల్సిందే. రీసెంట్‌గా ఆయ‌న ఉప్పెన చిత్రానికి సంగీతం అందించ‌గా, అందులోని ప్ర‌తి పాట ఎంతో ఆక‌ట్టుకునేలా ఉంది. ముఖ్యంగా నీ క‌న్ను నీలి స‌ముద్రం అనే పాట‌ల‌తో అంద‌రి దృష్టిని ఉప్పెన చిత్రం వైపు మ‌ర‌ల్చాడు దేవి. ఈ . సినిమా క‌థ‌, క‌థ‌నం, హీరోహీరోయిన్లు ఒకెత్తు అయితే..డీఎస్పీ మ్యూజిక్ మ‌రో ఎత్తు.

ఉప్పెన సినిమాకు అంత అద్భుత‌మైన సంగీతం అందించిన దేవి శ్రీకు చిరంజీవి బ‌హుమ‌తి పంపారు.
స్టార్స్ చిత్రాల‌కు ఎంత ప్యాష‌న్‌తో సంగీతాన్నిస్తావో..చిత్రరంగంలోకి ప్ర‌వేశిస్తున్న కొత్త టాలెంట్ కు అంతే ప్యాష‌న్ తో మ్యూజిక్ నందిస్తావ్‌. నీలో ఉండే ఎన‌ర్జీ, సినిమాల‌కు నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్ప‌టికీ ఇలాగే ఉండాల‌ని నిన్ను మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను. దేవీ నువ్వు నిజంగా రాక్‌స్టార్ వి అంటూ చిరు రాసిన ప్ర‌శంసా లేఖ‌ను చ‌దివి వినిపించి..సంతోషంలో మునిగిపోయాడు డీఎస్పీ. ఇక చిరు గిఫ్ట్ ప్యాక్‌ను ఓపెన్ చేయ‌గా, ఇందులో ప్రేమికుల ప్ర‌తిమ ఉంది. ఇది చూసి సంతోషించాడు. త‌న‌కు గిఫ్ట్ పంపిన చిరుకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు.