మీ పీఎఫ్ అకౌంట్ యూఏఎన్ నెంబర్ గుర్తులేదా.. వెంటనే ఇలా చేయండి?

ప్రతి ఒక్క ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఎంతో ముఖ్యం. ఈ విధంగా పిఎఫ్ అకౌంట్ ఉన్నటువంటి వారికి 12 అంకెల గల యూఏఎన్ నెంబర్ ఎంతో అవసరం.ఈ 12 అంకెలగల నెంబర్ ద్వారా మనం మన పిఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందనే విషయాన్ని ఎంతో సులభంగా చెక్ చేసుకోవచ్చు అయితే కొంతమంది కొన్నిసార్లు ఈ యు ఏ ఎన్ నెంబర్ మరిచిపోతూ ఉంటారు. ఈ విధంగా ఈ నెంబర్ మర్చిపోయిన వారు తిరిగి వారి నెంబర్ తెలుసుకోవాలంటే ఇలా చేయాల్సిందే..

సాధారణంగా ఒక ఉద్యోగి ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటిసారి వారికి పిఎఫ్ ఖాతా ఓపెన్ చేసి 12 అంకెల గల యూఏఎన్ నెంబర్ ఇస్తారు.అయితే మనం ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు ఇలా ప్రతిసారి పిఎఫ్ ఖాతా ఓపెన్ చేసి నెంబర్ మార్చుకోవాల్సిన పనిలేదు మొదటిసారి మనకు ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబర్ కూడా మనకు ఇక్కడ పనిచేస్తుంది. ఈ నెంబర్ కి కేవైసీ వివరాలు లింక్‌ చెయ్యాలి.

పొరపాటున మనం యూఏఎన్ నెంబర్ మర్చిపోతే వెంటనే అధికారిక వెబ్‌ సైట్‌ ఈపీఎఫ్‌లో పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి. అనంతరం యుఏఎన్‌ అనే ఆప్షన్ మీద క్లిక్‌ చేయాలి. ఇప్పుడు మీరు మీ మెంబర్ ఐడీ, రాష్ట్రం, రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలను ఇవ్వాలి.పీఎఫ్ మెంబర్ ఐడీ శాలరీ స్లిప్‌లో ఉంటుంది.
ఇప్పుడు గెట్ ఆథరైజేషన్ పిన్ మీద నొక్కండి.
పీఎఫ్ నెంబర్ తో లింక్ అయిన మొబైల్ కి పిన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. ఈ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన అనంతరం వాలిడిటీ ఓటీపీ అండ్ గెట్ యూఏఎన్‌పై క్లిక్ చేయాలి.మీ మొబైల్ నెంబర్‌కు మీరు మర్చిపోయిన యూఏఎన్ నెంబర్ మెసేజ్ వస్తుంది.