3 రెక్కలు, 4 రెక్కలు ఉన్న ఫ్యాన్ లలో దేనికి తక్కువ కరెంట్ అవసరమవుతుందో తెలుసా?

సాధారణంగా ఏ ఇంట్లో చూసినా కూడా మూడు రెక్కలు ఉన్న ఫ్యాన్లు కనిపిస్తాయి. అక్కడక్కడ ఒక రెక్క లేక నాలుగు రెక్కలు ఉన్న ఫ్యాన్లు అరుదుగా కనిపిస్తాయి. అయితే దాదాపు 99 శాతం మంది మూడు రెక్కలు ఉన్న ఫ్యాన్స్ ని మాత్రమే ఉపయోగిస్తారు. ఒకరి రెక్క ఉన్న ఫ్యాన్ కొనాలంటే గాలి సరిగా రాదేమో అన్న అనుమానం ఉంటుంది. ఇక నాలుగు రెక్కలు ఉన్న ఫ్యాన్స్ కొనాలంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందేమో అని భయం ఉంటుంది. అయితే వీటిలో ఏ ఫ్యాన్ ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది ఏ ఫ్యాన్ కి ఎక్కువ కరెంట్ అవసరం అవుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనకు అవసరాన్ని బట్టీ.. ఎన్ని బ్లేడ్ల ఫ్యాన్ వాడాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. చాలా మంది పెద్ద రెక్కలు ఉంటే.. ఎక్కువ కరెంటు ఖర్చవుతుందనీ.. చిన్న రెక్కలు ఉంటే.. తక్కువ ఖర్చవుతుందని అనుకుంటారు. నిజానికి ఫ్యాన్‌కి ఉన్న మోటర్‌ని బట్టీ కరెంటు అవసరం అవుతుంది. ఏ ఫ్యాన్ అయినా కొనేటప్పుడు దానికి ఉన్న బ్లేడ్లు, దాని డిజైన్, దాని మోటర్, దాని నుంచి వచ్చే గాలి ప్రవాహ రేటు ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి.

సింగిల్ బ్లేడ్ ఫ్యాన్లు మనకు ఎక్కువగా కనిపించవు. కానీ వాటి ప్రయోజనం వాటికి ఉంది. అవి ప్రత్యేకించి ఒకే ప్రదేశానికి గాలిని పంపిస్తాయి. అందువల్ల వీటిని పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం ఎక్కువగా వాడుతారు. ఇక రెండు బ్లేడ్ల ఫ్యాన్లను ఇళ్లలో వాడుతుంటారు. ఇవి ఎక్కువ గాలి ఇస్తాయి. కాకపోతే.. చిన్న గదులకు మాత్రమే ఇవి సెట్ అవుతాయి. మూడు బ్లేడ్ల ఫ్యాన్లు ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఇవి గాలిని అన్ని వైపులకూ సమానంగా ఇస్తాయి. కరెంటు వాడకం కూడా తక్కువగానే ఉంటుంది. ఇక నాలుగు బ్లే్డ్ల ఫ్యాన్లను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. విశాలమైన రూమ్స్ లో వీటిని వాడటం మేలు. ఇవి ఎక్కువ గాలిని ఇస్తాయి. అందుకు తగ్గట్టే.. కరెంటు వాడకం కూడా పెరుగుతుంది.

కరెంటు తక్కువ ఉపయోగించే ఫ్యాన్ కొనటానికి వాటి మీద ఉన్న ఎనర్జీ స్టార్ రేటింగ్ బట్టి కొనవచ్చు. ఎక్కువ స్టార్స్ కొనటం వల్ల తక్కువ కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. కనీసం 3 , 4 స్టార్స్ ఉన్న ఫ్యాన్స్ కొనటం మంచిది.